రాణాతో కలిసి "చరిత్ర" సృష్టిస్తాడట!
on Jul 12, 2016
బాలీవుడ్ లో కెమెరామెన్ గా వర్క్ చేసి ఆ అనుభవంతో తెలుగులో దర్శకుడిగా మారి "చిత్రం, జయం, నువ్వు-నేను" లాంటి సెన్సేషనల్ హిట్లు సాధించి దర్శకుడీగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నాడు తేజ. ఆ తర్వాత వరుస పరాజయాలతో వెనుకబడ్డాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన "హోరా హోరీ" కూడా ఘోర పరాజయం పాలైంది. దాంతో ఒక ఏడాదిపాటు గ్యాప్ తీసుకొని మరీ మంచి కథ సిద్ధం చేసుకొన్నాడు.
రాణా కథానాయకుడిగా.. కాజల్, కేతరీన్ లు కథానాయికలుగా సురేష్ బాబు నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న ఈ చిత్రానికి "చరిత్ర" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా విలేజ్ పాలిటిక్స్ నేపధ్యంలో తెరకెక్కనుందని సమాచారం. కాజల్ ఓ సాధారణ గృహిణిగా కనిపించనుండగా.. రాణా క్యారెక్టర్ ఏంటనేది తెలియాల్సి ఉంది!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
