చందమామ కథకు జాతీయ అవార్డు
on Mar 24, 2015
కేంద్రప్రభుత్వం మంగళవారం 62వ జాతీయ అవార్డులను ప్రకటించిది. ఈ అవార్డుల్లో చందమామకథలు సినిమా ఉత్తమ తెలుగు చలనచిత్రంగా అవార్డు గెలుచుకుంది. దీంతో ఆ సినిమాలో నటించిన మంచు లక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ''ఓ మై గాడ్.. ఓ మై గాడ్.. నా సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన విషయం ఇప్పుడే తెలిసింది. యాయాయాయా...'' అంటూ ఆనందం ప్రకటించారు.
జాతీయ అవార్డుల పూర్తి వివరాలు:
జాతీయ ఉత్తమ చిత్రం - కోర్ట్ (మరాఠీ)
ఉత్తమ హిందీ చిత్రం - క్వీన్
జాతీయ ఉత్తమనటి - కంగనా రనౌత్ (క్వీన్)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - మేరీ కోమ్
ఉత్తమ మరాఠీ చిత్రం - కిల్లా
ఉత్తమ కన్నడ చిత్రం - హరివు
ఉత్తమ బెంగాలీ చిత్రం - నిర్వాసితో
ఉత్తమ తెలుగు చిత్రం - చందమామ కథలు