ఓపెనింగ్స్ కష్టమేనా?
on Mar 24, 2015
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వలేదు అన్నట్టుంది వైవీఎస్ పరిస్థితి. అష్టకష్టాల మధ్య ఎట్టకేలకు తన 'రేయ్' విడుదవుతున్నందుకు సంతోషించాలో లేక సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోజు వస్తున్నందుకు బాధపడాలో అర్థంకాని పరిస్థితి. గురువారం రోజున భారత్-ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఉన్న సంగతి తెలిసిందే. అందులో భారత్ గెలిస్తే తర్వాతి మూడురోజులూ ఫైనల్ మ్యాచ్ సందడిలో ఉంటారంతా. ఇలాంటి టైమ్ లో ఫైనల్ మ్యాచ్ అయ్యేవరకూ థియేటర్ వైపు చూసే జనాలెందరో చెప్పలేం. దీంతో మ్యాచ్ తర్వాతి రోజైన శుక్రవారం విడుదవుతున్న 'రేయ్' కి కనీసం ఓపెనింగ్స్ వస్తాయా అనే డౌట్ చాలామందిలో ఉంది. మరోవైపు లౌక్యంతో లైన్లోకి వచ్చిన గోపీచంద్ 'జిల్' కూడా ఇదే రోజు విడుదవుతోంది. అయితే మ్యాచ్ హీట్ ను దాటుకుని థియేటర్లకు వచ్చేవారెందరు? వచ్చినవారి దారెటు? గోపీ 'జిల్' కి జిల్ మంటారా? తేజ్ 'రేయ్' అంటే వెళతారా? వెయిట్ అండ్ సీ.