విమర్శకులను తప్పుపడితే ఎలా??
on Mar 25, 2015
చందమామ కథలు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం ప్రకటించారు. ఈ సినిమా అందుకు అర్హమైనదో, కాదో అనే విషయం పక్కన పెడితే.. ఈ చిత్రానికి జాతీయ పురస్కారం వచ్చినందుకు దర్శకుడు ప్రవీణ్ సత్తారుని అభినందించాల్సిందే. అయితే ఇప్పుడు ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలు ఇండ్రస్ర్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన ఏకంగా రివ్యూలు రాసేవాళ్లనే దుయ్య పడుతున్నాడు. సమీక్షలు రాసేవాళ్లంతా నిజంగానే సమీక్షకులేనా?? అంటూ ప్రశ్నిస్తున్నాడు. టైప్ చేయడం వచ్చినవాళ్లంతా రివ్యూలు రాసేస్తే ఎలా అంటూ ఎద్దేవా చేస్తున్నాడు. ''వాళ్లు ఏది పడితే అది రాసేస్తే ఎలా..? సినిమా చూసే టైమ్‌ని బట్టి కూడా మూడ్ ఆధారపడి ఉంటుంది. ఆ మూడ్, టైమ్ రెండూ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపించకూడదు'' అంటున్నాడు ప్రవీణ్ సత్తారు. ఈ సినిమాకి రివ్యూలు ఏమంత గొప్పగా రాలేదు. ఒక్కటనే కాదు.. దాదాపు అన్ని రివ్యూలలోనూ ఇదే పరిస్థితి. అందుకే.. వసూళ్లు సరిగా రాలేదు. కొంతమందికి నచ్చి , కొంతమందికి సినిమా నచ్చలేదంటే అది కొంతమంది సమస్యే. అయితే ఏ రివ్యూ కూడా సరిగా లేదంటే అర్థం ఏమిటి?? సమస్య సినిమాలోనే ఉందని కదా.? ఆ విషయం ప్రవీణ్ సత్తారు మర్చిపోతే ఎలా??