బాలయ్యతో బోయపాటి ముహూర్తం కుదిరింది!!
on Mar 7, 2019
బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే అభిమానులు పండగ చేసుకుంటారు. సింహా, లెజెంట్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వాటిని మించేలా మరో సినిమా వీరి కలయికలో చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. ఇక ఇటీవల బోయపాటి చేసిన `వినయ విధేయ రామ` చిత్రం డిజాస్టర్ కావడంతో బాలయ్య తన ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడట. ఈ సినిమా పొలిటికల్ అంశాలతో పాటు భారీ కమర్షియల్ అంశాలతో నందమూరి అభిమానలకు కనువిందులా ఉంటుందట. ఇక బాలయ్య లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ బోయపాటికి తెలిసినంతగా వేరెవరికీ తెలియదనడానికి సింహా, లెజెండ్ చిత్రాలే సాక్ష్యం.
ఇక బాలయ్య చేసిన `ఎన్టీఆర్ బయోపిక్` కూడా ఆశించనంతగా ఆడకపోగా డిజాస్టర్ గా నిలిచి బాలయ్యను కొంత నిరాశకు లోను చేసింది. దీంతో బాలయ్య మరిన్ని జాగ్రత్తలు తీసుకొని నెక్ట్స్ సినిమా ఎలాగైన గట్టిగా కొట్టాలని ఆరాటపడుతున్నాడట. ఇక త్వరలో ఎలక్షన్స్ రానున్నాయి. అందుకే ఈ నెల 28న సినిమాను లాంఛనంగా ప్రారంభించి జూన్ లో రెగ్యులర్ షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ లోపు బోయపాటి స్క్రిప్ట్ పై మరింత వర్కవుట్ చేసే సమయం కూడా ఉంటుంది కాబట్టి బాలయ్య ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఎన్ బికే బేనర్ పై నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆడకపోవడం వలన బాలయ్య తన తదుపరి సినిమాను వేరే బేనర్ లో చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇప్పటికే సి.కళ్యాన్ ఆ బాధ్యతలను నిర్వహిస్తున్నట్లు తె లుస్తోంది.