4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న ఇర్ఫాన్ ఖాన్!
on Apr 29, 2020

వెండి తెరపై వైవిధ్యమైన నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న ఇర్ఫాన్ ఖాన్ చివరి జీవితం ఎంతో ఆవేదనతో.. ప్రతి ఒక్కరి కళ్లలో కన్నీటి సుడులు మిగిల్చింది. ఆయన మరణవార్తతో సినీలోకం శోఖసంద్రంలో మునిగిపోయింది. ఇర్ఫాన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ ను కడసారి చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇర్ఫాన్ భౌతికఖాయాన్ని సందర్శించి, నివాళులర్పించే అవకాశం కూడా లేదు. మరోపక్క ఆయన అంత్యక్రియలకు సైతం కుటుంబ సభ్యులు మినహా ఇతరులెవరూ హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన నటుడి చివరి ఘడియలు ఇంత దయనీయంగా మారడంపై సినీ లోకాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
ఆయన కెరీర్ లో ఒక జాతీయ పురస్కారం, 4 ఫిలింపేర్ అవార్డులు దక్కించుకొన్నారు. మొదటి నుంచి ఎలాంటి కాంట్రవర్సీలకు వెళ్లకుండా తన పని తాను చేసుకు పోయే మంచి నటుడు తమను వీడిపోవడంపై బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



