'బిగ్ బాస్ 2' విన్నర్ పెళ్లి చేసుకున్నాడు!
on Apr 29, 2020

కళ్యాణం వచ్చినా, కక్కు వచ్చినా ఆగదని పెద్దలు చెబుతారు. కరోనా కూడా కల్యాణాన్ని ఆపలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కరోనా కారణంగా లాక్ డౌన్ వచ్చి పడడంతో ప్రపంచవ్యాప్తంగా పలు పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. వాయిదా వేసుకోవడం ఇష్టం లేని కొందరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. 'బిగ్ బాస్' సెకండ్ సీజన్ విన్నర్ కౌశిక్ కూడా అలాగే పెళ్లి చేసుకున్నాడు. ఇతడు తెలుగు 'బిగ్ బాస్' విన్నర్ కాదు, హిందీ 'బిగ్ బాస్' సెకండ్ సీజన్ విన్నర్ అశుతోష్ కౌశిక్.
నోయిడాలో పెళ్లికూతురు ఇంటి టెర్రస్ మీద అసుతోష్ కౌశిక్ పెళ్లి జరిగింది. రెండేళ్ల క్రితం కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన అర్పిత మెడలో ఏప్రిల్ 26న అతడు మూడు ముళ్లు వేశాడు. ఈ పెళ్లికి పెళ్లి కొడుకు తల్లి, సోదరి, సోదరుడు సహా పెళ్లికూతురి తల్లి, సోదరుడు మాత్రమే హాజరయ్యారు. మిగతా వాళ్ళందరూ వీడియో కాల్స్ లో పెళ్లి చూశారు. అక్షయ తృతీయ రోజున కొత్త జీవితం ప్రారంభించడం శుభదాయకం అని ఫిబ్రవరిలోనే ముహూర్తం నిర్ణయించినట్లు, వాయిదా వేయడం ఇష్టం లేక పెళ్లి చేసుకున్నట్టు అసుతోష్ కౌశిక్ తెలిపాడు. పెళ్లి కోసం ఖర్చు పెట్టాలనుకున్న డబ్బును డొనేషన్ చేయనున్నట్టు అతను తెలిపాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



