ఇర్ఫాన్‌ఖాన్‌కు టాలీవుడ్ ప్రముఖుల నివాళి
on Apr 29, 2020

ఇర్ఫాన్ ఖాన్ మన మధ్య నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో అలరించారు. ఇర్ఫాన్ ఇక లేరని తెలియగానే సినీకళామతల్లి ఎక్కిఎక్కి ఏడ్చింది..! అరుదైన నటుడిని కోల్పోయామంటూ సినీప్రముఖులు బరువెక్కిన గుండెలతో కంటతడిపెట్టారు..! తమ అభిమాన హీరో ఇక లేరంటూ అభిమానులు కన్నీళ్లుపెట్టుకున్నారు.
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌కి తెలుగు పరిశ్రమతో కూడా మంచి అనుబంధం ఉంది. ఆయన ఆకస్మిక మృతితో టాలీవుడ్ ప్రముఖులు కూడా షాక్‌కి గురయ్యారు. ఈ సందర్భంగా తమ ట్విట్టర్ ద్వారా ఇర్ఫాన్ మృతికి సంతాపం తెలిపారు . వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇర్ఫాన్ వంటి అసాధారణ నటుడిని కోల్పోవడం భారతీయ సినిమాకే కాదు ప్రపంచ సినిమాకి కూడా నష్టమే. నేను వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిని కోల్పొయాను - గుణశేఖర్
సినిమా ప్రపంచం ఆభరణాన్ని కోల్పోయింది. అత్యంత అసాధారణమైన నటులలో ఇర్ఫాన్ ఒకరు . చిత్ర పరిశ్రమ ఖచ్చితంగా ఆయన సేవలని కోల్పోతుంది. మీ ఆత్మకి తప్పక శాంతి చేకూరుతుంది - రామ్ చరణ్
2020లో విషాదం జరగకూడదని అనుకున్నా. అదే జరిగింది. ఆయన ఇంత తొందరగా వెళతారని అస్సలు ఊహించలేదు. ఇర్ఫాన్ ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను - తమన్నా
సినిమా ప్రపంచం గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయనతో పని చేసే అదృష్టాన్ని కోల్పొయాను. మీ నటనని మాత్రం చూసి ఆనందించా. మీ సేవ ఎప్పటికి గుర్తుండి పోతుంది- వెంకటేష్
మీ మరణం నన్ను చాలా కలిచి వేసింది. తొందరగా మమ్మల్ని విడిచి వెళ్లావు ఇర్ఫాన్.చిత్ర పరిశ్రమకి చేసిన సేవలకి ధన్యవాదాలు. చాలా మిస్ అవుతున్నాం - ప్రకాశ్ రాజ్
భారతీయ సినీ పరిశ్రమకి చెందిన అద్భుతమైన నటులలో ఇర్ఫాన్ ఒకరు. ఆయన మృతి కలిచివేసింది- సాయిధరమ్ తేజ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



