జీవితం అనేది రోలర్‌కోస్టర్ రైడ్ వంటిదంటారు ఇర్ఫాన్‌ఖాన్!
on Apr 29, 2020
.jpg)
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేశాడు. క్యాన్సర్ మహమ్మారి నుంచి బయట పడేందుకు కొన్నాళ్లపాటు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇటీవల ఓ మీడియాతో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధి గురించి, తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. కష్ట సమయంలో ఉన్నప్పుడు తన భార్య సుతప, ఇద్దరు కొడుకులు తనకు ఎంతోగానో అండగా నిలిచారని పేర్కొన్నారు. మళ్లీ మాములు మనిషిని కావడంలో కుటుంబం పాత్ర అమితంగా ఉందన్నారు.
''జీవితం అనేది రోలర్ క్యాస్టర్ రైడ్ వంటిది. మధురమైన అనుభూతులతోపాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. సంతోషకరమైన క్షణాలను మాత్రమే గుర్తుంచుకోవాలి. మేము కొన్ని బాధలను అనుభవించాం.. అంతకంటే ఎక్కువ ఆనందంగా గడిపాం. నేను విపరీతమైన ఆందోళనకు గురయ్యాను.. కానీ దానిని ప్రస్తుతం నియంత్రించగలిగాను. నా కొడుకులతో గొప్ప సమయం గడిపాను''. అని చెప్పుకొచ్చారు. అలాగే భార్య గురించి అడగ్గా.. 'నేను జీవించాలి అనుకుంటే కేవలం నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను. నేను ఇంకా బతికి ఉండటానికి ఆమె కారణం' అని పేర్కొన్నారు.
ఇర్ఫాన్‌ఖాన్.. తుదిశ్వాస దాకా పోరాడాడు..! ఆ క్యాన్సర్ మహమ్మారిని ఓడించలేకపోయాడు..! అభిమానుల్ని దుఃఖసాగరంలోకి నెట్టి అతడు వెళ్లిపోయాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



