'రాధేశ్యామ్' ప్లేస్ లో 'బంగార్రాజు'.. సోగ్గాడి సంక్రాంతి సందడి షురూ
on Jan 5, 2022

సంక్రాంతి రేస్ నుంచి 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' సినిమాలు తప్పుకోవడంతో తెలుగు ప్రేక్షకులు తీవ్ర నిరాశ చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంక్రాంతికి సందడి చేయడానికి తాము వస్తున్నాం అంటున్నారు అక్కినేని హీరోలు. 'బంగార్రాజు' సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల చేస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
అక్కినేని సోగ్గాడు కింగ్ నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా 2016 సంక్రాంతికి విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఇదే కాంబినేషన్ లో 'బంగార్రాజు' సినిమా వస్తుంది. అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తుండటం విశేషం.

'బంగార్రాజు' సినిమాని సంక్రాంతికే విడుదల చేస్తామని ముందు నుండి మూవీ టీమ్ చెబుతూ వస్తుంది. కానీ రిలీజ్ డేట్ ని మాత్రం ప్రకటించలేదు. అయితే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన బంగార్రాజు టీమ్.. మూవీ విడుదల తేదీని ప్రకటించింది. జనవరి 14 న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఈ తేదీన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన రాధేశ్యామ్ విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా విజృంభణ కారణంగా పలు రాష్ట్రాల్లో థియేటర్స్ మూతపడటంతో ఈ సినిమా వాయిదా పడింది. ఇప్పుడు రాధేశ్యామ్ ప్లేస్ లోకి బంగార్రాజు వచ్చింది. 2016 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా వస్తున్న 'బంగార్రాజు' 2022 సంక్రాంతికి ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



