ఆంధ్రాలో టికెట్ రేట్ల విషయంలో నాకేం ఇబ్బంది లేదు.. నాగార్జున స్టేట్‌మెంట్!
on Jan 6, 2022

నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమా జనవరి 14న విడుదల కానున్నది. బుధవారం సాయంత్రం అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలోని ఫ్లోర్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని నాగార్జున ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశంలోని పలు ప్రాంతాల్లో థియేటర్లు మూసివేస్తుండటం, లేదా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధిస్తుండటంతో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నాయి. దీంతో సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమాగా 'బంగార్రాజు' నిలుస్తోంది.
Also read: 'ఆర్ఆర్ఆర్' విడుదలపై స్టే కోసం హైకోర్టుని ఆశ్రయించిన అల్లూరి సౌమ్య!
అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్నీ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని ప్రశ్నిస్తూ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ మీడియా వేదికగా, ట్విట్టర్ వేదికగా సంధించిన ప్రశ్నలు టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారాయి. టికెట్ ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమిటని ఆర్జీవీ వేసిన ప్రశ్నలకు పేర్ని నాని ఇచ్చిన సమాధానాలు చిత్రసీమలోని అత్యధికుల్ని సంతృప్తిపర్చలేకపోయాయి.
Also read: పవన్, సంపూ సినిమాలకి తేడా లేకపోతే.. మంత్రిగా మీకు, మీ డ్రైవర్ కి కూడా తేడా లేనట్లేనా?
కాగా, టికెట్ల అంశం గురించి ఏం చెబుతారంటూ ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి బంగార్రాజు ప్రెస్‌మీట్‌లో నాగార్జున నిరాకరించారు. "సినిమా స్టేజ్ మీద రాజకీయ విషయాలు మాట్లాడకూడదు. నేను మాట్లాడను" అని చెప్పారు. "కమర్షియల్‌గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఇబ్బంది కలిగే వాతావరణం ఉందేమో" అనడిగితే, "ఏం లేదండీ.. నాకేం ఇబ్బంది లేదు" అని అన్నారు. "అయితే అక్కడి టికెట్ రేట్ల పట్ల హ్యాపీగా ఉన్నారన్నమాట" అంటే, "టికెట్ రేట్లు ఎక్కువ ఉంటే ఎక్కువ డబ్బు వస్తుంది, నా సినిమాకు ఇబ్బంది లేదు" అని స్పష్టం చేశారు నాగార్జున.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



