రాజ'శేఖర్'కి లవ్ గంట మోగింది!
on Jan 5, 2022

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శేఖర్'. ఈ సినిమాకి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ కి సూపర్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదలైంది.
'శేఖర్' మూవీ నుండి మొదటి సాంగ్ లిరికల్ వీడియోని తాజాగా మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. 'లవ్ గంటే' అంటూ సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ మెలోడీ సాంగ్స్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ 'లవ్ గంటే' సాంగ్ తో మ్యాజిక్ చేశాడు. అనూప్ మ్యూజిక్, చంద్రబోస్ అందించిన క్యాచీ లిరిక్స్ సాంగ్ ని హమ్ చేసుకునేలా ఉన్నాయి. విజయ్ ప్రకాష్, అనూప్ రూబెన్స్, రేవంత్ ఈ సాంగ్ ని ఎంతో హుషారుగా అలరించారు. ఈ సాంగ్ యూత్ ని ఆకట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక లిరికల్ వీడియోలో రాజశేఖర్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన వేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మొదట లలిత్ అనే కొత్త దర్శకుడుతో ప్రారంభమైన 'శేఖర్' సినిమాకి తరువాత జీవిత దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. రాజశేఖర్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకోవడం, జీవిత ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



