ఇదేం సంస్కారం.. దేవరను చూసి నేర్చుకోండి!
on Sep 14, 2022
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంతమంది అభిమానులున్నా.. అందరిలోనూ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తన ప్రత్యేకత చాటుకుంటూ ఉంటాడు. సినిమా వేడుకల్లో 'నా దేవుడు' అంటూ పవన్ ని ప్రశంసిస్తూ భారీ డైలాగ్ లు కొడుతుంటాడు. అయితే ఇద్దరు యువ హీరోలకు పవన్ ని చూసి నేర్చుకోండి అంటూ చురకలు వేశాడు.
సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తాజాగా జరగగా.. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య, అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో అడివి శేష్, సిద్ధు కాలు మీద కాలేసుకుని కూర్చోవడాన్ని బండ్ల తప్పుబట్టాడు.

పవన్ ని ప్రశంసిస్తూ తరచూ ట్వీట్ చేసే బండ్ల తాజాగా గతంలో పవన్ ఈవెంట్స్ లో వినయంగా కూర్చున్న ఫొటోలతో పాటు అడివి శేష్, సిద్ధుల ఫోటోని షేర్ చేసి.. "సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం మా దేవర.. దయచేసి నేర్చుకోండి.. ఆచరించండి.. అది మన ధర్మం" అంటూ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం బండ్ల ట్వీట్ వైరల్ గా మారింది. కొందరు నెటిజన్లు పవన్ కాలు మీద కాలేసుకుని కూర్చొని ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. వాళ్ళ కంఫర్ట్ ని బట్టి కూర్చుంటారు, అందులో తప్పేముందని కామెంట్స్ చేస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



