'స్వాతిముత్యం'.. కొంపదీసి ఏదైనా ప్రాబ్లమా?
on Sep 14, 2022

బెల్లంకొండ గణేష్ ను హీరోగా పరిచయం చేస్తూ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ ట్రైలర్ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేసింది మూవీ టీమ్.
ఈరోజు హీరో గణేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా టీజర్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. నలభై సెకన్ల పాటు సాగే ఈ వీడియో ఆద్యంతం సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతుంది. 'స్వాతిముత్యం' అనే టైటిల్ కి తగ్గట్లే హీరో అమాయకత్వం, హీరోయిన్ తో మాట్లాడటానికి ఇబ్బంది పడటం ఆకట్టుకుంటున్నాయి. "కొంపదీసి ఏదన్నా ప్రాబ్లమా?", "మీరింకా సింగిల్ గా ఎందుకుండిపోయారో నా కిప్పుడర్ధమయింది" అంటూ హీరోని ఉద్దేశించి హీరోయిన్ పలికిన సంభాషణలు అలరిస్తున్నాయి.

అలాగే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఆ వీడియోలో చూపించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మ్యూజిక్ డైరెక్టర్ గా మహతి స్వర సాగర్, సినిమాటోగ్రాఫర్ గా సూర్య వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద తదితరులు నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



