బాలయ్య, మహేశ్ తో కొరటాల మల్టిస్టారర్?
on Nov 18, 2021

వరుస విజయాలతో ముందుకు సాగుతున్న విజనరీ డైరెక్టర్ కొరటాల శివ.. ఇటీవల `ఆచార్య`ని పూర్తిచేశారు. మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో రూపొందిన ఈ మల్టిస్టారర్.. 2022 ఫిబ్రవరి 4న థియేటర్స్ లో సందడి చేయనుంది. కాగా, `ఆచార్య` తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ పాన్ - ఇండియా మూవీని ప్లాన్ చేస్తున్నారు కొరటాల. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. 2022 ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీ తరువాత `ఆచార్య` తరహాలో మరో మల్టిస్టారర్ ని ప్లాన్ చేస్తున్నారట కొరటాల. అంతేకాదు.. ఇందులో నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలిసి నటించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. మరి.. ఈ కథనాల్లో వాస్తవమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇది నిజమైతే గనుక.. `శ్రీమంతుడు`, `భరత్ అనే నేను` తరువాత మహేశ్ తో కొరటాల తీయబోయే మూడో సినిమాగా ఈ మల్టిస్టారర్ నిలుస్తుంది. ఇక బాలయ్యతో కొరటాల చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. చూద్దాం.. ఏం జరుగుతుందో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



