ENGLISH | TELUGU  

'దృశ్యం-3' ఎప్పుడు వస్తుందంటే?

on Nov 18, 2021

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'దృశ్యం-2'. వెంకటేష్ గత చిత్రం 'నారప్ప' నేరుగా ఓటీటీలో విడుదల కాగా.. ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 25 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన వెంకటేష్.. సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

*'దృశ్యం-2' ఎలా మొదలైంది?
వెంకటేష్: మీకు తెలుసుగా ఎలా మొదలైందో.. దృశ్యం ఆల్రెడీ చూశారుగా(సరదాగా నవ్వుతూ). జీతూ జోసెఫ్ 'దృశ్యం-2' స్క్రిప్ట్ తో వచ్చి కలిశారు. ఆరేళ్ళ క్రితం కేసు రీఓపెన్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇలా ఎవరూ ఆలోచించలేరు అన్నట్లుగా రాంబాబు ఐడియాస్ ఉంటాయి. ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి మాస్టర్ ప్లాన్స్ వేస్తాడు. edge of seat thriller movies అంటారు కదా అలా ఉంటుంది.

*మలయాళ 'దృశ్యం-2'లో మోహన్ లాల్ యాక్టింగ్ గురించి?..
వెంకటేష్: ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది. ఆయన సినిమాలు రీమేక్ చేయడం బిగ్ ఛాలెంజ్.

* 'నారప్ప', 'దృశ్యం-2' రెండూ రీమేక్ సినిమాలే.. కొత్త కథలు మీ దగ్గరకి రావడం లేదా?..
వెంకటేష్: నాకు రీమేక్ హీరో అనే ట్యాగ్ మీరే ఇచ్చారుగా(సరదాగా). కొత్త కథలు రావట్లేదు అని ఎందుకు అనుకోవాలి. రిమేక్స్ అయినా ఇవి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదుగా. నా దగ్గరకు ఇంతమంచి సినిమాలు వచ్చాయన్న తృప్తి ఉంటే చాలు.

*'నారప్ప', 'దృశ్యం-2' బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీలోనే ఎందుకు? 
వెంకటేష్: ప్లాన్ చేసింది కాదు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా థియేటర్స్ కి రావడంలేదు. ప్రెజెంట్ ఓటీటీలకు అలవాటు పడిపోయాం. చూద్దాం నెక్స్ట్ మూవీస్ ఉన్నాయి కదా.

*బ్యాక్ టూ బ్యాక్ ఓటీటీలోనే అంటే మీ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వరా?
వెంకటేష్: కొంచెం ఫీల్ అవుతారు. కానీ నా ఫ్యాన్స్ కి పేషన్స్ ఎక్కువ. అర్థంచేసుకుంటారు. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో వాళ్ళని సర్ ప్రైజ్ చేస్తా.

* 'F3' మూవీని థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తారా?
వెంకటేష్: సమ్మర్ లో థియేటర్స్ లోనే రిలీజ్ అవుతుంది. ఇప్పటికే 'F3' షూటింగ్ ఆల్మోస్ట్ అయిపొయింది. ఇంకా రెండు స్మాల్ షెడ్యుల్స్ ఉన్నాయి అంతే. 'F2'లో లాగానే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అలాగే మనందరికీ డబ్బే పెద్ద సమస్య. ఆ పాయింట్ ని బేస్ చేసుకొని సినిమా ఉంటుంది. ఫుల్ ఫన్ ఉంటుంది.

* 'F3' లో కూడా 'వెంకీ ఆసన్' లాంటి మ్యానరిజం ఉంటుందా?
వెంకటేష్: అది రివీల్ చేయను.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

* 'దృశ్యం-3' ఉంటుందా?
వెంకటేష్: తెలీదు. కానీ ఉంటుంది. ఆ సమస్య(మర్డర్ కేసు) రాంబాబుని వెంటాడుతూనే ఉంటుందిగా. చూద్దాం. జోసెఫ్ స్క్రిప్ట్ రెడీ చేయాలిగా. ఒకవేళ ఉన్నా 3-4 సంవత్సరాలు పట్టొచ్చు.

*డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమా ఉందా?
వెంకటేష్: కొత్త సినిమలు ఏవీ ఇంకా కమిట్ కాలేదు. స్క్రిప్ట్స్ రెడీ అవుతున్నాయి. చూడాలి.

* రానాతో చేస్తున్న వెబ్ సిరీస్ గురించి?
వెంకటేష్: షూట్ జరిగింది. అందులో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. లుక్ రివీల్ అయ్యాక సర్ ప్రైజ్ అవుతారు.

* 'జై భీమ్' మూవీ చూసారా?
వెంకటేష్: ఇంకా చూడలేదు.. చూడాలి.

* మీ జెనరేషన్ హీరోలు ఎవరూ ఫాదర్ క్యారెక్టర్స్ చెయ్యట్లేదు.. మీరు చేయడానికి కారణం?
వెంకటేష్: ఎవరి ఛాయిస్ వాళ్ళది. నా నచ్చి చేస్తున్నాను అంతే. ఎప్పుడూ లైఫ్ లో ఎవరితోనూ పోల్చుకోకూడదు. మనస్సుకి నచ్చింది చేయాలి. సెల్ఫ్ శాటిస్ఫ్యాక్షన్ ఇంపార్టెంట్.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.