"ఆమె అభినయించింది.. ఆమె జయించింది".. నయన్‌పై సామ్ స్పెషల్ నోట్!
on Nov 18, 2021
.webp)
నవంబర్ 17 రాత్రి చెన్నైలో జరిగిన నయనతార బర్త్‌డే పార్టీకి సమంత హాజరయ్యింది. ఈరోజు తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆ పార్టీకి సంబంధించిన రెండు ఫొటోలను షేర్ చేసి, నయనతారకు బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ స్పెషల్ డేకి నయనతారను ఉద్దేశించి ఒక పవర్‌ఫుల్ నోట్‌ను రాసింది సమంత. విఘ్నేశ్ శివన్ డైరెక్ట్ చేస్తోన్న 'కాదు వాకుల రెండు కాదల్' మూవీలో నయన్, సామ్ తొలిసారి కలిసి నటిస్తున్నారు.
నయన్ బర్త్‌డే సందర్భంగా చెన్నైలో నిన్న రాత్రి ఆమె బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ పార్టీ ఇచ్చాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. ఈ పార్టీకి 'కాదు వాకుల రెండు కాదల్' మూవీలో నటిస్తోన్న సమంత, విజయ్ సేతుపతి కూడా హాజరయ్యారు.
తను షేర్ చేసిన పోస్టులో నయన్‌ను క్వీన్‌గా అభివర్ణించింది సమంత. "ఆమె వచ్చింది. ఆమె చూసింది. ఆమె ధైర్యం చేసింది. ఆమె కలగంది. ఆమె అభినయించింది, ఆమె జయించింది!! హ్యాపీ బర్త్‌డే నయన్. #happybirthdaynayanthara #queen #kaathuvaakularendukaadhal (sic)." అంటూ నయన్‌ను కీర్తించింది.
.webp)
వర్క్ విషయానికి వస్తే రొమాంటిక్ కామెడీగా విఘ్నేశ్ రూపొందిస్తోన్న కాదు 'వాకుల రెండు కాదల్' మూవీలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తుండగా, నయనతార, సమంత హీరోయిన్లుగా చేస్తున్నారు. డిసెంబర్‌లో ఈ మూవీ విడుదల కానున్నది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



