బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్.. బన్నీ దే హవా!
on Dec 22, 2021

``తగ్గేదే లే`` అంటూ మాంచి మాస్ పార్టీ ఇచ్చి మరీ `పుష్ప - ద రైజ్`తో ఫస్ట్ పాన్ - ఇండియా హిట్ కొట్టేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకున్న `పుష్ప - ద రైజ్`కి.. తనే ప్రధాన బలంగా నిలిచి సర్వత్రా వసూళ్ళ బాట పట్టించాడు ఈ టాలెంటెడ్ స్టార్. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అన్య భాషల్లోనూ కాసుల వర్షం కురిపిస్తున్న ఈ యాక్షన్ డ్రామా.. వారం లోపే తెలుగునాట ఈ యేటి టాప్ గ్రాసర్ గా నిలవడం విశేషం.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గత ఏడాది కూడా అల్లు అర్జున్ ఖాతాలోనే తెలుగునాట టాప్ గ్రాసర్ ఉంది. తను కథానాయకుడిగా నటించిన `అల వైకుంఠపురములో`తో నిరుడు ఈ ఫీట్ ని సాధించాడు బన్నీ. మొత్తమ్మీద.. 2020లో `అల వైకుంఠపురములో`, 2021లో `పుష్ప - ద రైజ్` అంటూ బ్యాక్ టు బ్యాక్ ఇయర్స్ లో హయ్యస్ట్ గ్రాసర్స్ చూసి టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాడు అల్లు అర్జున్. మరి.. వచ్చే ఏడాది కూడా `పుష్ప - ద రూల్`తో ఇదే పరంపరని కొనసాగించి.. హయ్యస్ట్ గ్రాసర్స్ పరంగా బన్నీ వరుస సంవత్సరాల్లో హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి.
Also read:శృంగారంతో ఆనందం..అషురెడ్డి బోల్డ్ కామెంట్స్
కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన `పుష్ప - ద రైజ్`కి సుకుమార్ దర్శకత్వం వహించగా.. రష్మికా మందన్న నాయికగా నటించింది. సమంత ఓ ప్రత్యేక గీతంలో చిందులేసిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ బాణీలు అందించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



