అఖండ 2.. పాన్ ఇండియా వైడ్ గా బాలయ్య తాండవం!
on Oct 15, 2024
టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ కి ఉండే క్రేజే వేరు. వీరి కాంబోలో ఇప్పటిదాకా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు రాగా.. మూడు ఒక దానిని మించి ఒకటి విజయం సాధించాయి. ఇప్పుడు వీరి కలయికలో నాలుగో సినిమా రాబోతుంది. (BB4)
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో రానున్న నాలుగో సినిమా 'అఖండ' సీక్వెల్ కావడం విశేషం. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకి 'అఖండ 2 - తాండవం' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. నేడు ఈ టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు మూవీని కూడా గ్రాండ్ గా లాంచ్ చేశారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానుంది. (Akhanda 2 Thaandavam)
'అఖండ-2' పాన్ ఇండియా మూవీగా రూపొందనుంది. లాక్ డౌన్ టైంలో విడుదలైన 'అఖండ' తక్కువ టికెట్ ధరలతోనూ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. 'అఖండ'లో శివతత్వాన్ని చూపించిన విధానం, బాలయ్య నటవిశ్వరూపం కలిసి.. ఆ సినిమాకి ఆ స్థాయి విజయాన్ని అందించాయి. ఇక ఇప్పుడు 'అఖండ-2'తో పాన్ ఇండియా వైడ్ గా అసలుసిసలైన తాండవం ఆడటానికి సిద్ధమవుతున్నారు.
థమన్ సంగీతం అందించనున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్స్ గా సి రామ్ ప్రసాద్, సంతోష్, ఆర్ట్ డైరెక్టర్ గా ఏ.ఎస్. ప్రకాష్, ఎడిటర్ గా తమ్మిరాజు వ్యవహరించనున్నారు.
Also Read