గేమ్ ఛేంజర్.. మెగా ఫ్యాన్స్ పరువు నిలబెడతాడా..?
on Oct 15, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి 'ఆర్ఆర్ఆర్' మూవీ కూడా చేశారు. కానీ ఈ ఇద్దరు హీరోలు ఎంతో స్నేహంగా ఉన్నప్పటికీ, ఈ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఆన్ లైన్ లో ఫుల్ గా గొడవపడుతూ ఉంటారు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఈ ఫ్యాన్ వార్ లు ఇంకా ఎక్కువైపోయాయి. ఆ సినిమా విడుదల సమయంలో "మా హీరోనే మెయిన్ హీరో" అంటూ మొదలైన గొడవ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
'ఆర్ఆర్ఆర్' తర్వాత.. తన తండ్రి చిరంజీవితో కలిసి 'ఆచార్య' సినిమాలో రామ్ చరణ్ నటించగా, అది డిజాస్టర్ అయింది. దీంతో అప్పుడు మెగా ఫ్యాన్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ గా ట్రోల్ చేశారు. ఇక 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన 'దేవర' (Devara) రీసెంట్ గా విడుదలైంది. మొదట ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ 'ఆచార్య-2' అంటూ మొదటిరోజు ఫుల్ గా ట్రోల్ చేశారు. కానీ అనూహ్యంగా దేవర.. టాక్ తో సంబంధం లేకుండా ఏకంగా రూ.450 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. దీంతో ఇప్పుడు రామ్ చరణ్ మీద బోలెడంత బాధ్యత పడింది.
రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ రిజల్ట్ అటు చరణ్ కి, ఇటు మెగా ఫ్యాన్స్ కి చాలా కీలకం. టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా.. దేవర స్థాయి వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆర్ఆర్ఆర్ క్రెడిట్ తమదేనంటూ మరోసారి ఫుల్ గా ట్రోల్ చేసే అవకాశముంది. పైగా సంక్రాంతికి బాలకృష్ణ నటిస్తున్న 'NBK 109' కూడా విడుదలవుతోంది. కాబట్టి నందమూరి ఫ్యాన్స్ అంతా ఏకమై, 'గేమ్ ఛేంజర్' ని మరింత టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. మరి గేమ్ ఛేంజర్.. దీనిని దాటుకొని హిట్ కొడుతుందేమో చూడాలి.
Also Read