మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని.. ఎవరిది పైచేయి..?
on Oct 15, 2024
సీనియర్ స్టార్ నందమూరి బాలకృష్ణ (Megastar Chiranjeevi) తన తరం స్టార్స్ తో పోటీ పడటమే కాకుండా, ఈ తరం స్టార్స్ తో కూడా పోటీ పడుతున్నాడు. కొన్నేళ్లుగా వేరే ఏ సీనియర్ స్టార్ కి సాధ్యంకాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతూ ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య.. 2025 సంక్రాంతికి 'NBK 109'తో బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఈ సంక్రాంతికి తన తోటి హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ల తనయులతో ఆయన పోటీ పడుతుండటం విశేషం.
బాలకృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఆ సీజన్ లో విడుదలైన పలు బాలయ్య సినిమాలు సంచలనాలు సృష్టించాయి. ఇక పొంగల్ పోరుకి బాలయ్య సినిమాతో పాటు చిరు సినిమా కూడా వస్తే ఆ కిక్కే వేరు. ఈ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద తలబడ్డారు. అయితే రాబోయే సంక్రాంతికి చిరంజీవికి బదులుగా ఆయన తనయుడు రామ్ చరణ్ (Ram Charan) బరిలోకి దిగుతున్నాడు. చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సంక్రాంతికి విడుదలవుతోంది. ఇక నాగార్జున తనయుడు నాగ చైతన్య (Naga Chaitanya) సైతం పండగ సీజన్ పై కన్నేస్తున్నాడు.
నిజానికి వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. ఏవో కారణాల వల్ల వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీంతో నాగ చైతన్య నటిస్తున్న 'తండేల్'ను సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అదే జరిగితే ఈ సంక్రాంతి 'మెగా వర్సెస్ నందమూరి వర్సెస్ అక్కినేని' వార్ గా మారుతుంది. మరి ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
Also Read