తమన్నా, కాజల్, పూజ బాటలో సామ్.. కామన్ ఫ్యాక్టర్ అతడే!
on Dec 16, 2021

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అంటేనే చార్ట్ బస్టర్స్ కి కేరాఫ్ అడ్రస్. అందులోనూ.. ఐటమ్ సాంగ్స్ అంటే తిరుగేలేదంతే. డీఎస్పీ కంపోజ్ చేసిన స్పెషల్ సాంగ్స్.. ఆల్ మోస్ట్ చార్ట్ బస్టర్సే. మరీముఖ్యంగా.. స్టార్
హీరోయిన్స్ ఫస్ట్ టైమ్ చేసిన స్పెషల్ సాంగ్స్ కి దేవి శ్రీ ట్యూన్ తోడైతే.. ఆ పాట సీటీ మార్ చార్ట్ బస్టరే. తమన్నా, కాజల్, పూజా హెగ్డే నుంచి తాజాగా సమంత వరకు ఇది కొనసాగుతూ వస్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కట్టిన `అల్లుడు శీను` (2014) కోసం తొలిసారిగా స్పెషల్ సాంగ్ చేసిన తమన్నా.. అందులోని``లబ్బరు బొమ్మ`` పాటలో తన చిందులతో కనువిందు చేసింది. ఫస్ట్
`ఐటమ్` హిట్ ని క్రెడిట్ చేసుకుంది. అలాగే, అంతవరకు ఐటమ్ సాంగ్ జోలికి వెళ్ళని కాజల్ అగర్వాల్.. డీఎస్పీ స్వరకల్పన చేసిన ``పక్కా లోకల్`` గీతంలో స్పెషల్ స్టెప్స్ వేసి `జనతా గ్యారేజ్` (2016)
విజయంలో భాగమైంది. ఇక నేటి స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అయితే `రంగస్థలం`(2018)లోని ``జిల్ జిల్ జిగేల్ రాణి`` గీతంతోనే తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ సక్సెస్ చూసింది. తనకదే ఫస్ట్ స్పెషల్ డ్యాన్స్
నంబర్ కూడా. ఈ పాటకీ దేవి శ్రీనే కంపోజర్.
కట్ చేస్తే.. ఇప్పుడు `పుష్ప - ద రైజ్` కోసం చెన్నై పొన్ను సమంత చేసిన ఐటమ్ నంబర్ ``ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామా``కి కూడా రాక్ స్టార్ నే రాకింగ్ ట్యూన్ కట్టాడు. మొత్తమ్మీద.. డీఎస్పీ
బాణీలతో తమన్నా, కాజల్, పూజ, సామ్.. ఇలా స్టార్ హీరోయిన్స్ చేసిన `తొలి` డ్యాన్స్ నంబర్స్ అన్నీ సెన్సేషన్స్ క్రియేట్ చేయడం విశేషం.
కాగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన `పుష్ప - ద రైజ్` రేపు (డిసెంబర్ 17) తెరపైకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



