మైలురాయి:500వ సినిమాలో అనుపమ్ ఖేర్
on Jun 14, 2016
బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ నటుడిగా మరో మైలురాయిని అందుకున్నాడు. భారతీయ సినీ పరిశ్రమలో చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమైన 500వ సినిమా ఘనతను అనుపమ్ సొంతం చేసుకున్నారు. 1984లో 29 ఏళ్ల వయసులో "సారాంశ్"తో ముఖానికి రంగేసుకున్న ఖేర్ కామెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అంచెలంచెలుగా ఎదిగి బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు . సారాంశ్, విజయ్, రామ్ లఖాన్, డాడీ, లమ్హే, ఖేల్, ధార్. దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే తదితర సినిమాల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించి అనేక అవార్డులు, రివార్డులు సాధించారు. అలా 32 ఏళ్ల సినీ ప్రస్థానంలో 499 సినిమాలు చేసిన అనుపమ్ తాజాగా హాలీవుడ్ సినిమా "ది బిగ్ సిక్" తనకు 500వ సినిమా అని ట్వీట్టర్‌లో తెలిపాడు. ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.