సమంతను అందుకు తొందర పెడుతున్న త్రివిక్రమ్!
on Jun 14, 2016
తెలుగు తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది సమంత. సమంత గురించి ఏం చెప్పినా, నిముషాల్లో పాకిపోతుంటుంది. రీసెంట్ గా ఆమె పెళ్లి గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంత ఒక ఇంటర్వ్యూలో సింగిల్ గా ఎవరున్నారు అంటూ డబుల్ మీనింగ్ లో డైలాగ్ వేయడం, పెళ్లి హైదరాబాద్ అబ్బాయితోనే జరుగుతుందని క్లియర్ గా చెప్పేయడం లాంటివన్నీ ఈ రూమర్లకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో సమంత పెళ్లి కన్ఫామ్ అయిపోయిందని, ఒక పెద్ద సినీ హీరో తనయుడితో ఆమె ప్రేమాయణం నడుపుతోందని, త్వరలోనే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి అతన్ని పెళ్లి చేసుకుని సెటిలైపోతుందని చాలా మంది సినీజనాలు ఫిక్సై పోయారు. కాగా త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ప్రతీ సినిమాలోను మెయిన్ హీరోయిన్ గా సమంతనే నటిస్తోంది. ఈ క్రమంలోనే వారి మధ్య సన్నిహిత్యం బాగా పెరిగిపోయిందట. ఈ సన్నిహిత్యంతోనే త్రివిక్రమ్ నువ్వు ప్రేమించిన వ్యక్తిని త్వరగా పెళ్లి చేసుకో... లేదంటే నీ ప్రేమ ప్రేమగానే మిగిలిపోతుంది.. పెళ్లి దాకా పోదు అంటూ సమంతకు సలహా ఇస్తున్నాడట. ఇంతకీ సమంత ప్రేమించిన ఆ పెద్ద సినీ హీరో కొడుకు ఎవరైవుంటారు... అసలు సమంత అతన్ని ప్రేమించిందా? లేదా...? పెళ్లి చేసుకుంటుందా? లేదా? అనే విషయాలు తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు ఫిల్మ్ నగర్ సినీ జనం.