ఓటీటీలో నేరుగా విక్రమ్ కొత్త చిత్రం!
on Jan 6, 2022

కరోనా ఎఫెక్ట్ తో దక్షిణాదికి చెందిన పలువురు అగ్ర కథానాయకుల చిత్రాలు ఓటీటీ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మరో కోలీవుడ్ స్టార్ సినిమా చేరనుంది. ఆ స్టార్ మరెవరో కాదు.. చియాన్ విక్రమ్.
ఆ వివరాల్లోకి వెళితే.. తన తనయుడు ధ్రువ్ విక్రమ్ తో కలిసి `అపరిచితుడు` స్టార్ విక్రమ్ ఓ యాక్షన్ థ్రిల్లర్ చేశారు. ఆ సినిమానే.. `మహాన్`. `పిజ్జా` ఫేమ్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్, వాణీ భోజన్, బాబీ సింహా ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతమందించిన ఈ సినిమాని సెవెన్ స్క్రీన్ స్టూడియో పతాకంపై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు.
గతంలో విక్రమ్ నటించిన `జెమిని`, `భీమ` తరహాలో `మహాన్` కూడా గ్యాంగ్ స్టర్ జానర్ సినిమాగా తెరకెక్కిందని సమాచారం. కాగా, తొలుత ఈ చిత్రాన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ దిశగా అడుగులు వేస్తున్నారని టాక్. అంతేకాదు.. రిపబ్లిక్ డే స్పెషల్ గా జనవరి 26 నుంచి అమెజాన్ ప్రైమ్ లో `మహాన్` స్ట్రీమ్ కాబోతోందని బజ్. మరి.. విక్రమ్, ధ్రువ్ కలిసి నటించిన `మహాన్`.. వీక్షకులను ఏ మేరకు రంజింపజేస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



