ఐదు ఆస్కార్ లు అందుకున్న అనోరా తెలుగు ఓటిటిలోకి వచ్చేసింది
on Mar 18, 2025
వేశ్యల జీవితాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించిన అమెరికన్ కామెడీ డ్రామా చిత్రం 'అనోరా"(Anora).'సీన్ బేకర్'(Sean Baker)రచనా దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ 'మైకి మాడిసన్' టైటిల్ రోల్ ని పోషించగా వన్య అనే యువరాజు క్యారెక్టర్ లో మార్క్ అలంసాండ్రో విచ్ కనిపించాడు.ప్రతిష్టాత్మక కేన్స్(Canes)ఫిలింఫెస్టివల్ లో అక్టోబర్ 18 న ప్రదర్శించగా,యునైటెడ్ స్టేట్స్ లో మాత్రం అక్టోబర్ 18 న విడుదలైంది.2025 ఆస్కార్ అవార్డ్స్ కి సంబంధించి మొత్తం ఐదు విభాగాల్లో ఆస్కార్(Oscar)ని అందుకుని చరిత్ర సృష్టించింది.
దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటిటి లోకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకుల తో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తూ వస్తున్నారు.నిజానికి ఈ మూవీ గతం నుంచే రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.కానీ ఇప్పుడు రెంటల్ లేకుండా జియో హాట్ స్టార్(Jio Hotstar)సబ్ స్క్రైబ్ ఉన్నవాళ్లు ఇంగ్లీష్,హిందీ లాంగ్వేజెస్ లో చూడవచ్చు.ఈ విషయాన్నీ జియో హాట్ స్టార్ అధికారంగా వెల్లడి చేసింది.ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతు ఉంది.
'అనోరా' అలియాస్ 'అని 'అనే వేశ్య వృత్తి చేసుకొనే అమ్మాయిని రష్యాకి చెందిన 'వన్య' అనే యువరాజు ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు.ఈ విషయం తెలిసిన యువరాజు తల్లి తండ్రులిద్దరు వాళ్ళని వేరు చెయ్యాలని చూస్తుంటారు.ఈ క్రమంలో అని,వన్య ఎలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నారు.వేశ్యల జీవితాల్లోని మానసిక సంఘర్షణ ఈ విధంగా ఉంటుందనే లాంటి విషయాలని ఎంతో హృద్యంతో చూపించడం జరిగింది. అందుకే ఐదు విభాగాల్లో ఆస్కార్ వరించింది.గంట ముప్పై తొమ్మిది నిమిషాల డ్యూరేషన్ తో తెరకెక్కిన 'అనోరా' 6 మిలియన్ డాలర్స్ వ్యయంతో అలెక్స్ కోకో,సమంత క్యూన్ నిర్మించగా 51 .9 మిలియన్ డాలర్స్ వసులు చేసింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
