లండన్ ఎయిర్ పోర్ట్ లో చిరంజీవి ప్రత్యక్షం..అభిమానుల హంగామ
on Mar 17, 2025
తెలుగు సినీసీమలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)కి ఉన్న చరిష్మా ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. నాలుగున్నర దశాబ్దాల నుంచి కొనసాగుతున్నతన సినీ జర్నీలో 150 కి పైగా సినిమాల్లో వివిధ రకాల పాత్రలు పోషించి తెలుగు చిత్ర పరిశ్రమకి విశేష కృషి చేస్తు వస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చేత ఎన్నోపురస్కారాలని అందుకున్నారు.కొన్ని రోజుల క్రితం యూకే(Uk)గవర్నమెంట్ ప్రతిష్టాత్మక జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నెల 19 న యూకే పార్లమెంట్ లో ఆ కార్యక్రమం జరగనుంది.
ఇందులో పాల్గొనడానికి చిరంజీవి లండన్(London)చేరుకున్నాడు.ఎయిర్ పోర్ట్ దగ్గరకి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలకడంతో పాటు వెల్ కమ్ అన్నయ్య అంటూ ప్లేకార్డులు ప్రదర్శించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.చిరంజీవి కూడా వాళ్లందరితో ఫోటోలు కూడా దిగగా ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక చిరు అప్ కమింగ్ సినిమాల విషయానికి వస్తే బింబిసార ఫేమ్ 'వశిష్ట' దర్శకత్వంలో చేస్తున్నవిశ్వంభర(Vishwambhara)మూవీ తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.ఇటీవల 'సంక్రాంతికి వస్తున్నాంతో' హిట్ ని అందుకున్న అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో ఒక మూవీ ఫైనల్ అవ్వగా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.2026 సంక్రాంతి కానుకగా ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. నాచురల్ స్టార్ నాని(Nani)నిర్మాతగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odhela)దర్శకత్వంలో మూవీకి కూడా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
