రాజోలు పిల్ల.. జోరందుకొందా?
on May 25, 2015
ప్రతిభ ఉన్నా, అవకాశాలొస్తున్నా... వాటిని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడుతోంది రాజోలు పాప అంజలి. తెలుగమ్మాయే అయినా అనువాద చిత్రాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకొంది. అయితే సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా, బలుపు లాంటి క్రేజీ చిత్రాలతో అవకాశాలు అందుకొంది. అయితే ఈ సినిమాలు ఆమె కెరీర్‌కు ఎలాంటి హైప్ ఇవ్వలేదు. దానికి తోడు తమిళ దర్శకుడితో పెట్టుకొన్న గొడవ, ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోయిన నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిన వైనం... అంజలి కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఉదయం షూటింగ్ కి ఆలస్యంగా వెళ్తుందని, క్రమశిక్షణ ఉండదని బ్యాడ్ రిమార్కులున్నాయి. తమిళ నిర్మాతల మండలి కూడా సీతమ్మని బహిష్కరించాలని ప్రయత్నించింది. అయితే వీటిన్నింటిని తట్టుకొని మళ్లీ నిలబడగలిగింది అంజలి. డిక్టేటర్‌లో అంజలి కథానాయికగా ఎంపికవ్వడం అందరినీ షాక్‌కి గురి చేసింది. ఈ సినిమాతో గనుక క్లిక్ అయితే... అంజలి కెరీర్ మలుపు తిరిగినట్టే. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఓ చిత్రంలో అంజలిని కథానాయికగా ఎంచుకొన్నట్టు సమాచారం. వీటితో పాటు మరో రెండు సినిమాలూ అంజలి చేతిలో ఉన్నాయట. వీటన్నింటినీ నిలబెట్టుకొంటే... ఈ తెలుగుమ్మాయి తన తడాఖా చూపించడం ఖాయం.