మెగా హీరోతో అనసూయ ఐటెమ్
on Oct 26, 2016
మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో అనసూయ ఐటెమ్ సాంగ్ చేయడానికి పచ్చ జెండా ఊపేసింది. సాయిధరమ్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి విన్నర్ అనే పేరు కన్‌ఫామ్ చేశారు. ఇందులో అనసూయ ఓ ఐటెమ్ గీతం చేయబోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక గా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఐటెమ్ గీతం కోసం అనసూయ రూ.15 లక్షలు డిమాండ్ చేసిందట. అనసూయకి ఉన్న పాపులారిటీ గమనించిన చిత్రబృందం అనసూయ అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యింది. సోగ్గాడే చిన్ని నాయినలోనూ అనసూయ ఐటెమ్ గాళ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. క్షణంలో ఫుల్ లెంగ్త్ మూవీ చేసింది. ఇప్పుడు విన్నర్‌లో మెగా హీరోతో చిందులేయబోతోందన్నమాట. ఈ పాటని త్వరలోనే తెరకెక్కిస్తారు.