సాయిధరమ్... మరో హీరోయిన్‌తో ఎఫైర్ మొదలెట్టాడు
on Oct 26, 2016
సాయిధరమ్ తేజ్ చూడ్డానికి అలా కనిపిస్తాడు గానీ... మనోడు భలే రొమాంటిక్. పిల్లా నువ్వు లేని జీవితం టైమ్‌లో రెజీనాతో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాడని వార్తలొచ్చాయి. ఆ తరవాత సుప్రీమ్ టైమ్‌లో రాశీఖన్నాతో ఎఫైర్ నడుపుతున్నాడని అంతా గుసగుసలాడుకొన్నారు. ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడన్నది టాలీవుడ్ వర్గాల టాక్. కంచె సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ప్రగ్యా. ఇప్పుడు కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న నక్షత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇందులోనే సాయిధరమ్ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ సమయంలో ఇద్దరికీ మధ్య మంచి రాపో కుదిరినట్టుంది.. దాంతో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. ఇటీవలే ఇద్దరూ ఓ రెస్టారెంట్‌లో రెగ్యులర్ గా కలుస్తూ.. పబ్లిక్ కళ్లలో పడిపోయారు. జూబ్లీహిల్స్‌లో ఓ రెస్టారెంట్‌లో రెగ్యులర్‌గా ఇద్దరూ డిన్నర్ చేస్తూ కనిపిస్తున్నారన్నది టాలీవుడ్ వర్గాల టాక్. మరి ఈ ఎఫైర్ ఎంత కాలం కొనసాగిస్తాడో, దీనిపైసాయి ధరమ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.