ఆయన మాట ఇస్తే హరిశ్చంద్రుడు..లేదంటే విశ్వామిత్రుడు
on Aug 17, 2017
నందమూరి బాలకృష్ణ నటించిన 101వ సినిమా పైసా వసూల్ ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక ఖమ్మంలో జరిగింది. ఈ ఈవెంట్‌లో చిత్ర నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ మన తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్ దివంగత ఎన్టీ రామారావు అన్నారు. అన్నగారి వారసత్వంతో పాటు క్రమశిక్షణ, గొప్ప లక్షణాలు పునికి పుచ్చుకున్న వ్యక్తి బాలయ్య బాబు అని ప్రశంసించారు. తాను బాలకృష్ణ గారితో సినిమా తీస్తున్నా అనేసరికి కొందరు ఆయనకు కోపమెక్కువ కదా..? ఆయనతో సినిమా ఎలా చేస్తారు అని అడగ్గా..నేను వారికి అవును అనే చెప్పాను. ఆయనకు కోపమెక్కువే కానీ..బాలయ్య మాట ఇస్తే సత్యహరిశ్చంద్రుడు..మాట తప్పితే మాత్రం విశ్వామిత్రుడు అన్నారు. ఆ ఒక్క నిజం తెలుసుకుంటే ఎవరైనా కూడా బాలయ్యతో పనిచేస్తారు అన్నారు.