ట్రైలర్ రివ్యూ: పైసా వసూల్
on Aug 18, 2017
నటసింహం నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంభినేషన్లో సినిమా తీయబోతున్నారు అనగానే ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. మాస్ డైరెక్టర్‌కు సూపర్ మాస్ హీరో దొరికితే ఆ సినిమా ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. అందుకు తగ్గట్టుగానే టీజర్‌తో తన సినిమా బేస్ ఏంటో చెప్పకనే చెప్పాడు పూరీ. తాజాగా పైసా వసూల్ ఆడియో లాంచ్ సందర్భంగా థియెట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్ చూస్తే ఇప్పటి వరకు ఇలాంటి బాలయ్యను చూడలేదు అనిపిస్తుంది. ముఖ్యంగా పూరీ మార్క్ పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి. యాక్షన్, ఆటపాటలు, కామెడీ ఇలా అన్నింట్లో బాలయ్యను సరికొత్తగా చూపించేందుకు పూరీ కష్టపడ్డట్టు తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలో నటసింహం సరసన శ్రేయా, కైరా దత్, ముస్కాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదిన మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.