రెండోసారి అల్లుడవుతానంటున్నాడు!
on Jul 13, 2016
ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ "అల్లుడుశీను" అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండో ప్రయత్నంగా నటించిన "స్పీడున్నోడు" ఫ్ళాపవ్వడంతో శ్రీనివాస్ కూడా స్పీడ్ తగ్గించి.. అప్పట్లో లాంఛనంగా మొదలై ఆగిపోయిన బోయపాటి ప్రోజెక్ట్ ను మళ్ళీ తెరమీదకు తీసుకువచ్చాడు. అగ్ర కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభంకానుంది.
బోయపాటి శైలి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి "అల్లుడు బంగారం" అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతోంది. పరిచయ చిత్రంతోనే అందరితోనూ "అల్లుడూ" అని ముద్దుగా పిలిపించుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ కు ఆ పిలుపు బాగా నచ్చినట్లుంది అందుకే తాజా చిత్రానికి "అల్లుడు బంగారం" అనే టైటిల్ ను ఫిక్స్ చేయించుకొన్నాడు. మరి ఈ సినిమాలో శ్రీనివాస్ ను "అల్లుడు బంగారం" అని ప్రేమతోనో లేక కోపంతోనో పిలిచే మావ పాత్ర ఎవరు పోషిస్తారో చూడాలి!