"బంతిపూల జానకి" సెన్సార్ పూర్తి!!
on Jul 13, 2016
ఉజ్వల క్రియేషన్స్ పతాకం పై.. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకత్వంలో కల్యాణి-రాం నిర్మాతలుగా రూపొందిన చిత్రం “బంతిపూల జానకి”. ధనరాజ్, దీక్షాపంత్ మరియు "జబర్దస్త్" టీమ్ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని "యూ/ఎ" సర్టిఫికేట్ అందుకొంది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు, సినిమా చాలా బావుంది అని ప్రశంసించదాంతోపాటు ఈమధ్య కాలంలో ఇలాంటి కామెడీ ఎంటర్ టైనర్ చూడలేదని, చాల చక్కగా సినిమాని తీర్చిదిద్దారని అన్నారు.
ఇటీవల విడుదలైన థియేటర్ ట్రైలర్ కి అనూహ్య స్పందన లభిస్తోంది. త్వరలో ఆడియో ఫంక్షన్ నిర్వహించి, విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ధనరాజ్, దీక్షాపంత్ హీరో, హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రంలో.. అదుర్స్ రఘు, చమ్మక్ చంద్ర, షకలక శంకర్, వేణు, రాకెట్ రాఘవ, డా. భరత్ రెడ్డి, సుడిగాలి సుధీర్, జీవన్, అవినాష్, ఫణి, నాగి, కోమలి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్. బాబు, సంగీతం: భోలే, ఎడిటింగ్: డా.శివ వై. ప్రసాద్, పాటలు : కాసర్ల శ్యాం, కథ – మాటలు : శేఖర్ విఖ్యాత్, ఫైట్స్ : సూపర్ ఆనంద్, ఆర్ట్ డైరెక్టర్ : విజయ్ కృష్ణ, పబ్లిసిటీ డిజినేర్ : వివ, కో-డైరెక్టర్ : బోయనపల్లి రమణ. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : తేజ, నిర్మాతలు : కల్యాణి –రాం. స్క్రీన్ ప్లే–దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
