మహేశ్ సినిమా జానర్ గురించి మాట్లాడిన రాజమౌళి!
on Dec 28, 2021

సినిమాలను జనరంజకంగా మలచడంలోనే కాదు, వాటిని మార్కెటింగ్ చేయడంలో గొప్ప నిపుణుడు యస్.యస్. రాజమౌళి. తన సినిమాలను ఎలా ప్రమోట్ చేయాలో, వాటికి హైప్ ఎలా క్రియేట్ చేయాలో తెలిసిన అతి కొద్దిమందిలో ఆయన ముందుంటాడు. ఒకవైపు ఒమిక్రాన్ భయపెడుతున్నా, మరోవైపు తన సినిమా 'ఆర్ఆర్ఆర్'ను ప్రమోట్ చేయడానికి దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాలలోనూ విస్తృతంగా పర్యటిస్తూ, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో, ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాక, తన తదుపరి సినిమాని తీసే పనిలో ఆయన నిమగ్నమవనున్నాడు.
మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో మహేశ్‌బాబుతో తను చేయబోతున్న సినిమా గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఇతివృత్తాలను అనుకున్నామనీ, అయితే స్క్రిప్టును ఇంకా ప్రిపేర్ చేయలేదనీ స్పష్టం చేస్తున్నాడు. ఆ సినిమా జానర్ గురించి చెప్పడానికి కూడా ఆయన నిరాకరిస్తున్నాడు. అయితే అది 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' మూవీస్‌కు పూర్తి భిన్నంగా ఉంటుందని మాత్రం వెల్లడించాడు. "వచ్చే ఏడాది మొదట్లో ఆ సినిమా గురించి మరిన్ని వివరాలు ప్రకటిస్తాం" అని చెప్పాడు రాజమౌళి.
మహేశ్‌బాబు, రాజమౌళి కలిసి పనిచేయనుండటం ఇదే మొదటిసారి. వాళ్ల కాంబినేషన్ మూవీ 2022 అక్టోబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. ఈలోగా మహేశ్ 'సర్కారువారి పాట' సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాని కూడా కంప్లీట్ చేయనున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



