అల... మాటల మాంత్రికుడితో బన్నీ మరో సినిమా
on Feb 4, 2020
'జల్సా', 'అత్తారింటికి దారేది', 'అజ్ఞాతవాసి'... ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూడు సినిమాలు తీశారు. పవన్ తర్వాత త్రివిక్రమ్ మూడు సినిమాలు చేసింది బన్నీతోనే. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా అంచనాలను తలకిందులు చేసింది. అయితే... అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు విజయాలు సాధించాయి. 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల... వైకుంఠపురంములో' విజయాల తర్వాత మరోసారి ఈ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ సినిమా చేయడానికి రెడీ అవుతోంది.
ఆల్రెడీ బన్నీకి త్రివిక్రమ్ ఒక ఐడియా చెప్పారని తెలిసింది. ఈ విషయాన్ని బన్నీ ధ్రువీకరించారు. "ఈ ఏడాది చాలా బాగా ప్రారంభమైంది. నా సినిమాల లైనప్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం సుకుమార్ తో సినిమా చేస్తున్నా. నేను, త్రివిక్రమ్ మరో ఐడియా అనుకున్నాం. ఆ ఐడియాపై మేము ఇద్దరం హ్యాపీగా ఉన్నాం. 'అల... వైకుంఠపుములో' విజయం తర్వాత మనిద్దరం సంతృప్తి చెందే ఐడియా దొరకడం సవాలే. కానీ, ఆ సవాల్ దాటేశాం. ఆ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను చేసుకోగలమని ఆశిస్తున్నాను" అని బన్నీ అన్నాడు. ఈ సినిమా సుకుమార్ సినిమా తర్వాత ప్రారంభం అవుతుందా? లేదా? అనేది తెలియాలి.