సుధీర్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కోసం రెండు కోట్ల సెట్
on Feb 5, 2020
బహుశా... సుధీర్ బాబు కెరీర్ లో ఇదే కాస్ట్ లీ ఇంట్రడక్షన్ సీన్ అనుకుంట! ఇంతకు ముందు సుధీర్ బాబు యాక్షన్ ఫిల్మ్స్ చేశాడు. అందులో ఫైట్స్ కూడా చేశాడు. కానీ, మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న 'వి' ఈ సినిమాలో అతని ఇంట్రడక్షన్ ఫైట్ ప్రత్యేకంగా ఉండబోతుంది. 'వి'లో సుధీర్ బాబు ఐపీఎస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. టాస్క్ ఫోర్స్ డిసిపి పాత్రలో కనిపించనున్నాడు. హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల నేపథ్యంలో అతడి ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేశారు. ఆ సీన్ కోసం రెండు కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ఒక కాలనీ సెట్ వేశారు. విజువల్స్ పవర్ ఫుల్ గా ఉండడం కోసం ఆ సెట్ కు నిప్పు పెట్టారట.
అల్లర్ల నేపథ్యంలో సన్నివేశాలు కదా! సినిమాలో తన ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగా వచ్చిందని సుధీర్ బాబు సంతోషం వ్యక్తం చేశాడు. 'సమ్మోహనం' తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో అతడు నటిస్తున్న చిత్రమిది. అందులో రొమాంటిక్ హీరోగా, బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ చేస్తే... ఇందులో యాక్షన్ హీరో రోల్ చేస్తున్నాడు. నేచురల్ స్టార్ నాని ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేస్తున్న సినిమా కూడా ఇదే. వి సినిమాలో సుధీర్ బాబు రక్షకుడు అయితే నాని రాక్షసుడు. ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయనీ, ముఖ్యంగా డైలాగులు ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయని సమాచారం. ఉగాది సందర్భంగా ఈ సినిమా మార్చి నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.