మెగా ప్రొడ్యూసర్‌తో చేతులు కలిపిన పవర్ స్టార్ డైరెక్టర్
on Mar 21, 2020
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింట్ సైట్లు ఇండియాలోనూ సూపర్ హిట్టవడంతో, తెలుగునాట తెలుగు కంటెంట్‌తో 'ఆహా' అనే ఒక స్ట్రీమింగ్ సైట్ తీసుకొచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశాడు నిర్మాత అల్లు అరవింద్. తక్కువ ధరకే దీనిని అందుబాటులో తీసుకొచ్చిన ఆయన ఇప్పుడు తెలుగు వెబ్ సిరీస్ కంటెంట్‌తో దానిని మరింత ఆకర్షణీయం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆయనతో డైరెక్టర్ క్రిష్ చేతులు కలుపుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే 'ఆహా' కోసం 'మస్తీస్' అనే వెబ్ సిరీస్‌ను క్రియేట్ చేసిన క్రిష్ రానున్న రోజుల్లో మరిన్ని వెబ్ సిరీస్‌ను నిర్మించి ఇవ్వనున్నట్లు సమాచారం. అంతే కాకుండా వాటికి స్క్రిప్టును క్రిష్ స్వయంగా అందిస్తున్నాడు. తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్ట్రీమ్ అయిన తొలి వెబ్ సిరీస్‌గా 'మస్తీస్' మంచి ఆదరణే పొందింది. ఇందులో నవదీప్, హెబ్బా పటేల్, బిందుమాధవి, చాందినీ చౌదరి, అక్షర గౌడ, రాజా చెంబోలు వంటివాళ్లు నటించారు.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో క్రిష్ ఓ సినిమా రూపొందిస్తున్నాడు. పీరియడ్ మూవీగా తయారవుతున్న ఈ సినిమా కోసం 'విరూపాక్ష', 'వారాహి' అనే రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించారు. దీపావళి లేదా, క్రిస్టమస్‌కు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
