అఘోరాగా బాలకృష్ణ! అయితే...
on May 1, 2020
నందమూరి నటసింహం బాలకృష్ణ... ఆయనకు 'సింహ', 'లెజెండ్' వంటి విజయాలు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నట సింహం అఘోరా పాత్రలో కనిపిస్తారనీ, అందుకోసమే గుండు చేయించుకున్నారనీ విషయాలు ప్రేక్షకులకు తెలిసినవే. తాజా ఇంటర్వ్యూలో బోయపాటి శ్రీను ఆ విషయాలు నిజమేనని స్పష్టం చేశారు. అయితే... అఘోరా సెటప్ అంతా కొత్తగా ఉంటుందనీ, ప్రేక్షకులు కన్వీన్స్ అయ్యేలా ఉంటుందనీ ఆయన చెప్పుకొచ్చారు.
బాలకృష్ణకు వరుస పరాజయాలు వస్తున్న సమయంలో 'సింహా' రూపంలో ఆయనకు బోయపాటి శ్రీను భారీ విజయాన్ని అందించారు. అప్పటివరకూ వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులు చూసిన బాలకృష్ణను పక్కనపెట్టి కొత్త బాలకృష్ణను తెరపై చూపించారు. అలాగే, 'లెజెండ్'లో కూడా! ఆ రెండు సినిమాలను మించి తాజా సినిమా ఉంటుందని బోయపాటి తెలిపారు. ఆ రెండిటి నుండి బయటకు వచ్చి కొత్తగా ఏదైనా చేయాలంటే అఘోరా వంటి పాత్ర కావాలని ఆయన అన్నారు. బోయపాటి శ్రీను స్వయంగా అఘోరా పాత్ర గురించి చెప్పడంతో నందమూరి అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఆల్రెడీ ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తయింది. అందులో ఒక ఫైట్, రెండు సీన్స్ తీశారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
