విజయ్ వారసుడి ఎంట్రీకి మెగా మేనల్లుడి 'ఉప్పెన'
on Apr 24, 2020
'ఉప్పెన'... తెలుగులో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, 'శంకర్ దాదా ఎంబిబిఎస్'లో బాలనటుడిగా చేసిన సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా. తెలుగులో ఇంకా సినిమా విడుదలవ్వక ముందే తమిళ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నారు. సినిమాలో ఆయన విలన్‌గా చేస్తున్న సంగతి తెలిసిందే.
'ఉప్పెన' తమిళ రీమేక్ రైట్స్ విజయ్ సేతుపతి తీసుకోవడం వెనుక తమిళ స్టార్ హీరో విజయ్ ఉన్నాడని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న 'హీరో'లో కూడా విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ చేసేటప్పుడు సెట్స్‌లో విజయ్‌కి 'ఉప్పెన' కథ చెప్పారట. తన కుమారుడు జాసన్ సంజయ్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడానికి సరైన కథ ఇదేనని విజయ్ భావించారట. ప్రస్తుతం కెనడాలో చదువుకుంటున్న జాసన్ ఇండియా వచ్చిన వెంటనే 'ఉప్పెన' రీమేక్ స్టార్ట్ చేసే ప్లానులో ఉన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా మొదలు అవుతుందని సమాచారం. తెలుగులో ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా, తమిళ రీమేక్ కి కూడా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో విలన్‌గా నటిస్తున్న విజయ్ సేతుపతి, తమిళంలోనూ విలన్‌గా నటించడంతో పాటు సినిమా నిర్మిస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
