అల్లు అర్జున్ కొత్తేపారం!
on Jul 25, 2016
స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుగా, స్టార్ హీరోగా సూపర్ స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్ త్వరలోనే రెండో సారి తండ్రి కాబోతున్నాడు. తనకు రెండో బిడ్డ పుట్టబోయేలోపు స్టార్ బిజినెస్ మ్యాన్ గానూ పేరు తెచ్చుకోవాలనుకొంటున్నాడు బన్నీ. అందుకే ఓ కొత్త బిజినెస్ మొదలెట్టాడు. బన్నీ మొదలెట్టినా వ్యాపారం ఏంటీ? అనుకొంటున్నారా... కంగారుపడకుండా పూర్తిగా చదవండి.
బన్నీ ఓ బ్రేవరీ స్టార్ట్ చేస్తున్నాడు. "బ్రివరీ" అంటూ మినీ బార్ అన్నమాట. డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉంటుంది. కాకపోతే.. మిగతా బార్ ల తరహాలో ఇక్కడవ్ ఎరే కంపెనీలు తయారు చేసే లిక్కర్, బీర్ అమ్మరు. సొంతంగా తయారు చేసిన బీర్ ను మాత్రమే అక్కడ సెర్వ్ చేస్తారు. అమెరికాలో ఇప్పటికే పాపులర్ అయిన ఈ తరహా బిజినెస్ ను త్వరలో బన్నీ హైద్రాబాద్ కు పరిచయం చేయనున్నాడు. ఇప్పటికే బీరు ఏరులై పారుతున్న మన హైద్రాబాద్ ఇప్పుడు బన్నీ బాబు కొట్టేపారం పుణ్యమా అని మరింత పుంజుకోనుందన్నమాట!