పవన్ లేకపోతే నేను లేను..
on Nov 15, 2016
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలోనే చాలామంది కుర్ర హీరోలు ఆయనకు ఫ్యాన్స్ గా ఉన్నారంటేనే అర్ధం చేసుకోవచ్చు. ఇక సామాజిక సేవ గురించి కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండస్ట్రీకే స్టార్ హీరోలను అందించిన సత్యానంద్ కూడా తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పవన్ కళ్యాణే అని చెబుతున్నాడు. ఇటీవల ఆయన ఒక ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పవన్ గురించి చెబుతూ.. తాను నాటకాలు వేసుకుంటూ కొంతకాలం గడిపానని, ఆ తరువాత నాటకాలు వేసే వాళ్లకు నటన నేర్పడానికి ఒక సంస్థను స్థాపించానని, ఆ సంస్థలోకి పవన్ కల్యాణ్.. విద్యార్థిగా చేరడం తన జీవితాన్నే మార్చేసిందని ఆయన చెప్పుకొచ్చాడు. పవన్ పెద్ద స్టార్ అవ్వడంతో ఆ సక్సెస్‌ని చూసిన ఇతర సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు తమ పిల్లలను తన దగ్గరకు పంపించారని దాంతో తానీరోజు 94 మంది నటులను సినీ ఇండస్ట్రీకి అందిచగలిగానని, ఒక రకంగా చెప్పాలంటే.. పవన్ లేకపోతే.. తాను లేనని చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



