అఖిల్‌కి సోషియా ఫాంటసీ స్టోరీ?
on Nov 20, 2014
వినాయక్ దర్శకత్వంలో అఖిల్ ఎంట్రీ ఖరారైపోయి చాలా రోజులైంది. ఇప్పటి వరకూ అన్నపూర్ణ కాంపౌండ్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన సంగతులేం బయటకు రాలేదు. కథ విషయంలో ఓ క్లారిటీ ఇచ్చాక.. అన్ని వివరాలూ ఒకేసారి మీడియాకు చెప్పేయాలని వినాయక్ - నాగార్జున భావిస్తున్నారు. వినాయక్ ప్రస్తుతం కోనవెంకట్, గోపీమోహన్ లతో కుస్తీలు పడుతున్నారు. అఖిల్ స్టోరీ విషయంలో ఓ క్లూ దొరికింది. ఇదో సోషియో ఫాంటసీ కథ అట. మాయలూ, మంత్రాల నేపథ్యంలో సాగే సినిమా అని తెలిసింది. ఈ జోనర్‌లో వినాయక్ ఎప్పుడూ సినిమా చేయలేదు. సో.. తనకి ఈ లైన్ కొత్తగా ఉంటుందని భావించాడట. అఖిల్ టాలెంట్లు పూర్తి స్థాయిలో ప్రదర్శించే కథ ఇదని అటు నాగార్జున కూడా నమ్ముతున్నాడట. అంతే కాదు.. ఈసినిమాలో నాగార్జున కెరీర్‌లో ఆల్ టైమ్ హిట్ గీతాన్ని రీమిక్స్ చేయాలని టీమ్ భావిస్తోందని సమాచారమ్. డిసెంబరులో ఈ సినిమాఎట్టిపరిస్థితుల్లోనూ సెట్స్‌పైకి వెళ్లడం ఖాయంలా అనిపిస్తోంది. ఈ నెలాఖరులోగా ఈసినిమాకి సంబందించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.