రామ్‌చరణ్‌ని దెబ్బకొట్టిన గోపీచంద్
on Nov 20, 2014
స్టార్ హీరో సినిమా వస్తోందంటే మిగిలిన సినిమాలకు ముచ్చెమటలు పట్టేస్తాయి. ఆ వసూళ్ల ప్రభావం మాపై ఎక్కడ పడిపోతుందో అన్న భయాలూ వెంటాడతాయి. కానీ సినిమాలో సత్తా ఉంటే.. ఏ స్టార్ హీరో, ఏం చేయలేడని మరోసారి నిరూపితమైంది. ఇందుకు గోపీచంద్ కథానాయకుడు నటించిన లౌక్యం చిత్రం అద్దం పట్టింది. సరిగ్గా దసరా పండక్కి వారం రోజుల ముందు విడుదలైంది.. లౌక్యం. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్పాఫీసు దగ్గర నిలబడగలిగింది. తీరా చూస్తే.. దసరా పండక్కి గోవిందుడు అందరివాడేలే వచ్చేశాడు. రామ్‌చరణ్ సినిమా అంటే.. అందరి కళ్లూ అటువైపే. దాంతో లౌక్యం నిర్మాతలు భయపడ్డారు. గోవిందుడు తమ సినిమాని దెబ్బ కొడతాడని ఊహించారు. అనుకొన్నట్టే గోవిందుడుకు తొలి మూడు రోజులూ భారీ వసూళ్లు వచ్చాయి. దాంతో లౌక్యం డల్ అయ్యింది. తొలి మూడు రోజుల ఊపు తగ్గాక.. అనూహ్యంగా లౌక్యం వసూళ్లు ఊపందుకొన్నాయి. కొన్ని చోట్ల గోవిందుడు వసూళ్లను దాటి లౌక్యం కలెక్షన్లు రాబట్టుకొంది. అంతేకాదు.. లౌక్యం సినిమా ఇటీవల 50 రోజులు పూర్తి చేసుకొంది. దాదాపు 50 కేంద్రాల్లో అర్థ సెంచరీ కొట్టింది. మొత్తానికి ఈ సినిమా రూ.20 కోట్ల వసూళ్లు దక్కించుకొంది. మరోవైపు గోవిందుడు అందరివాడేలే కేవలం 6 కేంద్రాల్లో 50 ఆడింది. చాలా చోట్ల బయ్యర్లకు డబ్బులు రాలేదట. మరికొన్ని చోట్ల స్పల్ప నష్టాలతో గోవిందుడు గట్టెక్కాడు. అలా... లౌక్యం - గోవిందుడు మధ్య జరిగిన పోటీలో... గోపీచంద్‌నే విజయం వరించింది.