కృష్ణవంశీ - ప్రకాష్ రాజ్ - దిల్‌రాజు సినిమా
on Nov 19, 2014
కృష్ణవంశీ - ప్రకాష్‌రాజ్‌ల మధ్య మంచి అనుబంధం ఉంది. కృష్ణవంశీ తన సినిమాల్లో ప్రకాష్‌రాజ్‌కి గొప్ప పాత్రల్ని డిజైన్ చేశాడు. మధ్యలో ఎందుకో.. వీళ్లిద్దరి అనుబంధానికి బ్రేక్ పడింది. గోవిందుడు అందరివాడేలేతో మళ్లీ ఈ ఫ్రెండ్‌షిప్‌కి చిగుర్లు వేశాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా వస్తోంది. అయితే ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్ నటుడు కాదు. నిర్మాత. తన డ్యూయోట్ మూవీస్ పతాకంపై కృష్ణవంశీతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఇందులో దిల్‌రాజు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటారు. అందరూ కొత్త వాళ్లే నటించే ఈ సినిమా కోసం కథ సిద్ధమవుతోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ సినిమా సంగతుల్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఓ గొప్ప దర్శకుడు, జాతీయ స్థాయి ఉత్తమ నటుడు, నిర్మాణ విలువలకు పేరెన్నదగిన నిర్మాత కలసి రూపొందించే ఈ చిత్రం ఎలా ఉంటుందో...?! ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో..??