సాధువుగా బాలకృష్ణ ఓకే నా..ఫ్యాన్స్ రియాక్షన్ తట్టుకోగలరా!
on Mar 4, 2024
నందమూరి అందగాడు బాలకృష్ణ కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.కొన్నిలక్షల మంది అభిమాన ఘనం ఆయన సొంతం. సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర పండగ వాతావరణాన్ని తీసుకొస్తారు.మూడు దశాబ్దాల పై నుంచి ఇదే తంతు. బాలయ్య కూడా తన అభిమానులని రంజింప చెయ్యడం కోసం ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తు ఉంటారు. తాజాగా ఆయన చెయ్యబోయే పాత్ర వైరల్ గా మారింది.
తెలుగు సినిమాకి ఆఫ్టర్ కరోనా అఖండ తో ఒక ఊపు వచ్చింది. బాలకృష్ణ డ్యూయల్ రోల్ పోషించిన ఈ మూవీ రికార్డు కలెక్షన్స్ ని సాధించింది. ముఖ్యంగా అఘోర పాత్రలో బాలయ్య నటించిన విధానానికి, చెప్పిన డైలాగ్స్ కి థియేటర్స్ దద్దరిల్లాయి. దీంతో సీక్వెల్ మీద అందరిలోను భారీ అంచనాలే ఉన్నాయి. అదే టైం లో బాలయ్య క్యారక్టర్ లో షేడ్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి కూడా ఉంది. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో ఒక విషయం చక్కర్లు కొడుతుంది. అఖండ 2 లో బాలయ్య సాధువుగా కనిపించబోతున్నాడనే టాక్ వినబడుతుంది. మేకర్స్ ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయినా కూడా సాధువుగా బాలయ్య కనిపించడం పక్కా అని అంటున్నారు.
ఇప్పుడు ఈ వార్త ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి డబుల్ ధమాకా అని చెప్పవచ్చు. ఎందుకంటే పార్ట్ 1 లో ఉన్న అఘోర క్యారక్టర్ యధాతధంగా ఉంటూనే సాధువు క్యారక్టర్ ఉండబోతుంది. ఎలాంటి కొత్త పాత్రని అయినా సరే అవలీలగా పోషించి థియేటర్లో కూర్చున్న వాళ్ళ చేత విజిల్స్ వేయించడం బాలయ్య స్టైల్. అఘోరా తో పూనకాలు తెప్పించిన బాలయ్య 2 లో సాధువుగా ఇంకెన్ని పూనకాలు తెప్పిస్తాడో చూడాలి. ఇప్పటికే దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ ని కూడా పూర్తి చేసాడు. అఖండ ని మించి పార్ట్ 2 ఉండబోతుందని బోయపాటి చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే మూవీ ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందనే విషయంపై అప్ డేట్ రావాల్సి ఉంది. గీత ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించబోతుందననే టాక్ అయితే చాలా బలంగానే వినిపిస్తుంది.
Also Read