శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'లగ్గం'!
on Mar 4, 2024
సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా 'లగ్గం'. 'భీమదేవరపల్లి బ్రాంచి' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
"మన తెలుగు సంప్రదాయంలోని తెలంగాణ పెళ్లిని కన్నుల విందుగా చూపించబోతున్నాననిప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు..." అని దర్శకుడు చెప్పారు. కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం. కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నిర్మాత వేణుగోపాల్ రెడ్డి అన్నారు.
సాయి రోనాక్, ప్రగ్యా నగ్రా హీరో హీరోయిన్ గా నటిస్తున్న లగ్గం సినిమాలో రాజేంద్రప్రసాద్, రోహిణి, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
"ఇది వరకు తెలుగు సాంప్రదాయంలో జరిగే పెళ్లి కాన్సెప్ట్ తో చాలా చిత్రాలు వచ్చాయి. అందుకు భిన్నంగా లగ్గం సినిమా ఉండబోతోందని తెలంగాణదనం ఉట్టిపడే విధంగా దర్శకులు రమేష్ చెప్పాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని" రాజేంద్రప్రసాద్ అన్నారు.
"దర్శకుడు రమేష్ చెప్పాల అన్ని హంగులతో లగ్గం యూనివర్స్ ను క్రియేట్ చేయబోతున్నారు."అని రోహిణి అన్నారు.
చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ గా కృష్ణ, ఎడిటర్ గా బొంతల నాగేశ్వర రెడ్డి వ్యవహరిస్తున్నారు.
కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చoద్ర, చిత్రం శ్రీను, సంధ్య గంధం, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, ప్రభాస్ శ్రీను, సత్తన్న తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read