త్రిష కోసం వస్తున్న బాలయ్య..!
on Apr 13, 2016

ఫేడవుట్ అయిపోయిన హీరోయిన్లందరూ, ఇక స్టార్స్ పక్కన అవకాశాలు రావనుకున్నప్పుడు, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తీసేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో చెన్నై చిన్నది త్రిష కూడా చేరింది. తెలుగు తమిళ భాషల్లో నాయకి అని ద్విభాషా చిత్రాన్ని రిలీజ్ చేయడానికి త్రిష రెడీగా ఉంది. హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా తనను తిరిగి ఫాంలోకి తీసుకొస్తుందని త్రిష భావిస్తోంది. ఈ నెల 19న నాయకి మూవీ ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేశారు మూవీ టీం. ఆడియోకు ఛీఫ్ గెస్ట్ గా నందమూరి బాలకృష్ణను పిలుస్తున్నారు. బాలయ్య, త్రిష ఇద్దరూ కలిసి లయన్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ అభిమానంతోనే బాలయ్య కూడా రావడానికి ఒప్పుకున్నాడట. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష పాడిన భయం అనే పాటకు మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. గోవి తెరకెక్కించిన నాయకి మే లో వెండితెరపైకి రాబోతోంది. సత్యం రాజేష్ కీలక పాత్ర పోషించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



