రంభ ఫ్యామిలీని చూశారా.. పెద్ద కూతురు హీరోయిన్ లా ఉంది!
on Oct 1, 2024
తెలుగు, తమిళ్ తో పాటు వివిధ భాషల్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రంభ (Rambha) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1990-2000 టైంలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. అప్పుడప్పుడు బుల్లితెర మీద మెరుస్తున్న ఈ బ్యూటీ క్వీన్.. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. 2010 లో ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. తాజాగా రంభ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద కుమార్తెలో రంభ లాగే హీరోయిన్ కళ కనిపిస్తోంది. మరి భవిష్యత్ లో తల్లి బాటలో తను కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుందేమో చూడాలి.
Also Read