ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దేవర దూకుడుకి ఇక బ్రేకులుండవు!
on Oct 1, 2024
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర' (Devara) మూవీ సెప్టెంబర్ 27 న విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం.. 500 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇప్పుడు వారి ఉత్సాహాన్ని రెట్టింపు చేసే మరో న్యూస్ వినిపిస్తోంది. (Devara Collections)
అనిరుధ్ సంగీతం అందించిన దేవర చిత్రంలో అన్ని పాటలూ మెప్పించాయి. ముఖ్యంగా 'దావుది' అనే డ్యాన్స్ నెంబర్ లో ఎన్టీఆర్ స్టెప్పుల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ సాంగ్ ని ట్రిమ్ చేసి, సినిమాని విడుదల చేశారు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు అభిమానుల్లో మళ్ళీ ఆనందం నింపడానికి దేవర చిత్ర బృందం సిద్ధమవుతోంది. సెకండాఫ్ లో 'దావుది' సాంగ్ ని యాడ్ చేస్తున్నారని, శుక్రవారం నుంచి అనగా అక్టోబర్ 4 నుంచి థియేటర్లలో ఈ సాంగ్ సందడి చేయనుందని సమాచారం. మూవీ టీం తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడంతో పాటు, వసూళ్లు పెంచుతుంది అనడంలో సందేహం లేదు. (Daavudi Song)
ప్రస్తుతం థియేటర్లలో ఇతర పెద్ద సినిమాలేవీ లేవు. దానికితోడు అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా, అక్టోబర్ 3 నుంచి దసరా సెలవలు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల బాట పట్టే అవకాశముంది. ఇక దావుది సాంగ్ యాడ్ అయితే.. ఎన్టీఆర్ డ్యాన్స్ కోసమైనా ఫ్యాన్స్ మరోసారి సినిమా చూడాలనుకుంటారు. ఈ లెక్కన దేవర కలెక్షన్ల జోరు ఇప్పట్లో తగ్గే ఛాన్స్ లేదు.
Also Read